calender_icon.png 16 September, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6౦౦ కోట్లు ఇస్తం

16-09-2025 01:17:54 AM

  1. మిగిలిన బకాయిలు నెలవారీగా చెల్లింపు 
  2. గత ప్రభుత్వ హయాంలో పథకం ఛిన్నాభిన్నం
  3. ఫీజురీయింబర్స్‌మెంట్ రేషనలైజేషన్‌పై కమిటీ వేస్తాం 
  4. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
  5. ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యతో ప్రభుత్వ చర్చలు సఫలం

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సీఎస్ రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనతో  కాలేజీల యాజమాన్యాలు సుదీర్ఘంగా జరిపిన చర్చలు సఫలమయ్యాయి.

భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రప్రభుత్వం ఫీజురియింబర్స్‌మెంట్ బకాయిలపై సానుకూలమైన నిర్ణయం తీసుకున్నదని, టోకెన్లకు సంబంధించి రూ.600 కోట్లను త్వరితగతిన విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులను నెలవారీగా ఎంతోకొంత విడుదల చేస్తామని స్ప ష్టం చేశారు.

పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన కుటుంబాలపై విద్యార్థుల ఫీజుల ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ఉమ్మ డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీ యింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. ఆ స్ఫూర్తితోనే తమ ప్రభు త్వం ముందుకు వెళ్తుందని వ్యాఖ్యానించా రు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఛిన్నాభిన్నం చేసిందని, ఆ భారాన్ని తాము భరిస్తున్నామన్నామని వివరించారు.

కాలేజీల బంద్ విరమణ విష యంలో కళాశాల యజమన్యాలు సానుకూలంగా స్పందించాయని, సమ్మె విరమిం చినందుకు కళాశాలల యజమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు. భవిష్య త్‌లో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సమస్యలను నివారించేందుకు ఒక కమిటీ వేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచనలు చేశామన్నా రు. కమిటీలో అధికారులు, కాలేజీల యాజమాన్యాలు ఉండి ఫీజురీయింబర్స్‌మెంట్ రేషనలైజేషన్‌పై అధ్యయనం చేస్తారని పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే టోకెన్ అమౌంట్ రూ.1,200 కోట్లు విడుదల చేయాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ చేయగా, ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేస్తామని ప్రస్తుతం అంగీకరించింది. 

 ప్రభుత్వానికి కృతజ్ఞతలు..

కాలేజీ యాజమాన్యాల కష్టాలను రాష్ట్రప్రభుత్వం అర్థం చేసుకున్నది. మేం సమ్మెకు వెళ్లినా ప్రభుత్వం ఎలాంటి కల్మషం లేకుం డా మా డిమాండ్లను అంగీకరించింది. దస రా పండుగకు ముందే రూ.600 కోట్లను విడుదల చేస్తామని ప్రకటించడం హర్షణీ యం. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రక నటతో మేం కాలేజీల బంద్ నిర్ణయాన్ని విరమించుకుంటున్నాం. 

మంత్రులతో సీఎం సమీక్ష?

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆదివారం అర్ధరాత్రి వరకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘం నేతలతో తొలుత సీఎస్ రామకృష్ణారావు, విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం డిప్యూటీ సీఎం, మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయి బకాయిల అం శంపై చర్చించారు.

బకాయిలు చెల్లింపునకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కానీ కాలేజీల యాజమాన్యాలు నాణ్యమైన విద్య అందించడంలో ప్రమాణాలను పట్టించుకోకపోవడంపై సీఎం సీరియస్ అయినట్లు తెలి సింది. గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ వేసి న విజినెల్స్ కమిషన్ రిపోర్టును సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి పరిశీలించి.. ‘కాలేజీ యాజ మాన్యాలు బకాయిలు అడుగుతున్నాయి సరే.. మరి విద్యాప్రమాణాల సంగతేంటని?’ చర్చించినట్లు సమాచారం. ఫీజుల విషయం లో నిక్కచ్చిగా ఉంటున్న కాలేజీలు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఫ్యా కల్టీ, ల్యాబ్‌లు, వసతులను కూడా అందించాలని సీఎం సూచించినట్లు సమాచారం.