16-09-2025 09:01:59 AM
తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత..
రూ.1,400 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం.
ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆస్పత్రుల యాజమాన్యాలు..
ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం..
గత 12 నెలలుగా పెండింగ్‌లో బకాయిలు..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టి అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు(Aarogyasri services) నిలిచిపోనున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో బంద్ చేస్తున్నట్లు టీఎన్ హెచ్ఏ ప్రకటన చేసింది. తెలంగాణ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ వెల్లడించారు. ఆరోగ్య శ్రీకి అనుసంధానమైన ప్రైవేట్ నెట్ వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం నిధులు నిలిపివేసింది. సమస్యల పరిష్కారానికి ఆరోగ్య శాఖ మంత్రి, ఆరోగ్య శ్రీ సీఈఓలను టీఎన్ హెచ్ఏ కలిశారు. ఎన్నిసార్లు కలిసినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. విధిలేని పరిస్థితుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు టీఎన్ హెచ్ఏ అధ్యక్షుడు రాజేష్ వెల్లడించారు. తెలంగాణ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ లో సుమారు 320 ఆస్పత్రులున్నాయి. గత 12 నెలలుగా పెండింగ్ బకాయిలు రూ.1,400 కోట్లు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఆరోగ్య శ్రీపై వైద్య సేలు పొందుతున్న వారు సేవలు నిలిచిపోనున్నయన్న విషయం తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.