10 August, 2026 | 5:00 AM

కొరియా మాస్టర్స్ విజేత అస్మిత

10-08-2026 12:00 AM

ఫైనల్లో చైనా షట్లర్‌పై సంచలన విజయం

కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్ సొంతం

అసన్ సిటీ, ఆగస్టు 9: భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం అస్మిత చలిహా చరిత్ర సృష్టించింది. కొరియా మాస్టర్స్ 300 టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకొచ్చిన అస్మిత తుదిపోరులోనూ అదరగొట్టింది. ఫైనల్లో 14 21- 21- స్కోరుతో చైనా క్రీడాకారిణి, 35వ ర్యాంకర్ హాన్‌ను ఓడించింది. అస్సాంకు చెందిన 26 ఏళ్ల అస్మిత తొలి గేమ్ కోల్పో యి వెనుకబడింది. అయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా ఆమె పుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి.

మిగిలిన రెండు గేమ్స్ లో వరుసగా పైచేయి సాధించి టైటిల్ గెలిచింది. తద్వారా తొలిసారి బ్యాడ్మింటన్ వర ల్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) టూర్ సింగిల్స్ ఫైనల్‌కు చేరింది. అలాగే బీడబ్ల్యూఎఫ్ వరల్ టూర్ సూపర్ 300 లేదా అంతకంటే ఎక్కువ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న ఐదో భారత క్రీడాకారిణిగా అస్మిత రికార్డులకెక్కింది. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 50వ స్థానంలో ఉన్న అస్మిత గౌహతిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పార్క్ టే-సాంగ్ ఆధ్వర్యంలో శిక్ష ణ పొందుతోంది. ఆమె కెరీర్‌లో ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ టైటిల్.