సర్ఫరాజ్ ఖాన్‌కు సెలక్టర్ల పిలుపు
సాయి సుదర్శన్ స్థానంలో ఎంపిక
రెండేళ్ల తర్వాత జట్టులోకి ఎంట్రీ
ముంబై, ఆగస్టు 9: గాయంతో శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు దూరమైన సాయి సుదర్శన్ స్థానంలో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. దీంతో రెండేళ్ల తర్వాత సర్ఫరాజ్ జాతీయ జట్టులో చో టు దక్కించుకున్నాడు.ఇటీవల లంక టూర్‌కు 15 మం దితో జట్టును ఎంపిక చేసినప్పుడు సాయి సుదర్శన్ పేరు కూడా ఉంది.
అయితే ఫిట్‌నెస్ సాధిస్తేనే టెస్ట్ సిరీస్‌లో ఆడతాడని బీసీసీఐ ముందే స్పష్టం చేసింది. ప్రస్తుతం సాయి సుదర్శన్ బెంగళూరు సీవోఈలో పునరావాసం పొందుతున్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. దీంతో లంకతో సిరీస్ నుంచి తప్పించారు. అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేశారు.
ఈ యువ బ్యాటర్ కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నా డు. సర్ఫరాజ్ చివరిసారిగా 2024లో న్యూజిలాండ్‌పై టెస్ట్ సిరీస్ ఆడాడు. తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి బరువు తగ్గినా సెలక్టర్లు మాత్రం అత న్ని పట్టించుకోలేదు. ఇటీవలే సోషల్ మీడియాలో అతను పెట్టిన పోస్ట్ కూడా చర్చనీయాంశంగా మారింది. తాను అక్కడ ఇమడలేకపోవచ్చు..కానీ తనకున్న శక్తితో పోరాడుతూనే ఉంటా అంటూ జెర్సీ సినిమా ఫోటోతో క్యాప్షన్ ఇచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటి వరకూ 6 టెస్టుల్లో 371 పరుగులు చేయగా, దీనిలో 3 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.






