లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో అసద్ ఫ్యామిలీ
10-12-2024 12:32 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: సిరియా అధ్యక్షుడు అసద్‌కు రాజకీయ ఆశ్ర యం కల్పించినట్టు రష్యా ప్రకటించిం ది. మానవతా కోణంలోనే ఆయ నకు ఆశ్రయం ఇచ్చినట్టు వెల్లడించింది. ఈ విషయంలో అధ్యక్షుడు పుతిన్ వ్యక్తిగతంగా ఆమోదం తెలిపినట్టు క్రెమ్లిన్ తెలిపింది. అయితే అసద్ ప్రస్తుతం ఏ ప్రదేశంలో ఉన్నాడనే దానిపై రష్యా స్పష్టత ఇవ్వలేదు. అయితే మాస్కోలో అసద్ తన ఫ్యామిలీతో కలిసి ఉన్నారని పేర్కొటూ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇటీవల సంవత్సరాల్లో అసద్ కుటుంబం దాదాపు 30 యూరో మిలియన్లతో 20 లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను మాసో ్కలో కొనుగోలు చేసినట్టు తెలిపింది. ఆ అపార్ట్‌మెంట్‌కు సంబం ధించిన ఫొటోలను కూడా బటయపెట్టింది. కాగా మాస్కోలోని సిరియా రాయబార కార్యాలయంపై సిరియన్లు జాతీయ జెండా ఎగరవేశారు.






