16 July, 2026 | 9:39 AM

మహిళల కోసం బీమా సఖి యోజన

10-12-2024 12:30 AM

* మహిళా ఏజెంట్ల నియామకానికి ఎల్‌ఐసీ పథకం

* ప్రారంభించిన ప్రధాని మోదీ

పానిపట్, డిసెంబర్ 9:  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో మహిళా ఏజెంట్లను నియమించేందుకు ఎల్‌ఐసీ ప్రవేశపెట్టిన “బీమా సఖి యోజన” పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది మహిళా ఏజెంట్లను నియమించడమే లక్ష్యంగా ఎల్‌ఐసీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. హర్యానాలోని పానిపట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పథకాన్ని మోదీ ప్రా రంభించి మహిళలకు నియామక పత్రాలను అందజేశారు. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయం ఉండేలా చూడడం, ఆర్థిక అక్షరాస్యతను పెంచడం, బీమాపై అవగాహన కల్పించడం ఈ పథకం ప్రాథమిక లక్ష్యమని ఎల్‌ఐసీ తెలిపింది.