17 April, 2026 | 11:44 AM

Breaking News

తుపాకీ గురిపెట్టి.. డబ్బు దోచుకున్న దుండగులు

12-06-2025 08:52 AM

హైదరాబాద్: పేట్ బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్(Pet Basheerabad Police Station) పరిధి కొంపల్లిలో బుధవారం రాత్రి దోపిడి జరిగింది. గన్ తో బెదిరించి ఇద్దరు దుండగులు డబ్బు దోచుకెళ్లారు. బైక్ పై వచ్చి సాయిబాబా అనే వ్యక్తిని బెదిరించి దుండగులు దోచుకెళ్లారు. రూ. 5 లక్షలు చోరీ చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రి కిరాణా షాపు మూసి ఇంటికి వెళ్తున్నట్లు సాయిబాబా ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.