స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
- మూడేళ్లలో ఒక్కో విద్యార్థిపై రూ.12.32 లక్షల ఖర్చు
- రూ.45 కోట్ల వ్యయం అంచనా
- ఏడాదికి ఒక్కొక్కరి నుంచి రూ.50వేల ఫీజు వసూలు
- పీపీపీ మోడ్‌లో యూనివర్సిటీ నిర్వహణ
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): అథ్లెటిక్స్‌లో విద్యార్థులను అత్యు త్తమంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొస్తోంది. సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు అసెం బ్లీలో ప్రవేశపెట్టిన స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం లభించింది.
ఈ బిల్లు యూనివర్సిటీకి సంబంధించిన స్వరూపాన్ని వివరించింది. పీపీపీ మోడ్‌లో యూ నివర్సిటీని నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. క్రీడలను ప్రోత్సహించే వ్యూహాత్మక అడుగుగా ప్రభుత్వం దీనిని అభివర్ణిం చింది. ఆటలు, శిక్షణతోనే సరిపెట్టకుండా, క్రీడావైద్య శాస్త్రంలో ప్రపంచస్థాయి వృత్తి నిపుణలను తయారు చేయనున్నట్లు స్పష్టంచేసింది.
యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించడం, భారత క్రీడా రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వర్సిటీని తీసుకొచ్చింది. క్రీడల్లోని నైపుణ్యాలను జీవనోపాధిగా మలుచుకునేం దుకు కూడా తోడ్పాటునందించనుంది.
మొదటి ఏడాది రూ.185 కోట్ల మూలధన వ్యయం
యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ఆర్థికపరమైన అంశాలను కూడా ప్రభుత్వం ఆ బిల్లులో పొందుపర్చింది. మొదటి ఏడాది తరగతి గదులు, కార్యాలయాలు, మౌలిక వసతులు సహా ఇతర సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.185కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది.
అలాగే, మొదటి మూడేళ్లకు సంబంధించి నిర్వహణ ఖర్చులతోపాటు సిబ్బంది వేతనాలకు రూ.45 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. ఇందులో మొదటి ఏడాది రూ.20.96కోట్లు, రెండో ఏడాది రూ.12.01 కోట్లు, మూడో ఏడాది రూ.12.01కోట్లు అవసరం అవుతాయని చెప్పింది. మూడేళ్లకు ఒక్కో విద్యార్థిపై రూ. 12.32 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
యూనివర్సిటీలో ఉండేదెవరు?
యూనివర్సిటీలో ఉన్నతస్థాయి పదవుల్లో ఛాన్స్‌లర్, వైస్ ఛాన్సలర్, ప్రో వైస్ ఛాన్స్‌లర్, రిజిస్ట్రార్, ఆర్థిక అధికారి, పరీక్షల కంట్రోలర్, క్రీడా వసతుల నిర్వాహకుడు ఉంటారు. ఛాన్స్‌లర్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించనున్నారు.
క్రీడలు, యువజన అభివృద్ధి శాఖ కార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శి, ఆర్థిక, ప్రణాళికశాఖ కార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శి, రాష్ట్రం క్రీడా అధికార సంస్థ చైర్‌పర్సన్, ఎండీ, క్రీడా హబ్ పాలక మండలి ప్రతినిధి యూనివర్సిటీలో కీలక అధికారి హోదాలో ఉండనున్నారు. హైదరాబాద్‌లో ప్రధాన యూనివర్సిటీ కేం ద్రాన్ని ఏర్పాటు చేసి, దానికి అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం బిల్లులో పేర్కొన్నది.
ఐలమ్మ మహిళా వర్సిటీ బిల్లుకు ఆమోదం
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం బిల్లుకు సోమవారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కోఠిలోని తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్టు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ పేరును మార్చాలంటే తెలంగాణ విశ్వవిద్యాలయ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే వర్సిటీ చట్టంలోని సెక్షన్ 3(1) షెడ్యూల్‌ను సవరించే బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టగా.. సభ ఆమోదం తెలిపింది. ఆధునిక మహిళలకు స్ఫూర్తినిచ్చేందుకు తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి నడిచిన ఐలమ్మ పేరును వర్సిటీకి పెడుతున్నట్టు బిల్లులో ప్రభత్వం పేర్కొంది.
మొదటి ఏడాది రూ.5,74,420
రెండో ఏడాది రూ.3,29,230
మూడో ఏడాది రూ.3,29,230
విద్యార్థులు చెల్లించే సగటు కోర్సు ఫీజు రూ.50,000
మూడేళ్లలో ఫీజుల రూపంలో రూ. 5.47 కోట్లు
యూనివర్సిటీ నిర్వహణకు వస్తుందని అంచనా
అవసరమైన మిగిలిన రూ.224.50 కోట్ల మొత్తాన్ని కార్పస్ ఫండ్ ద్వారా పీపీపీ మోడ్‌లో సేకరణ






