ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి
తెలంగాణను పార్లమెంట్తో పోలుస్తారా
మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్ తో పోల్చడంపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రసాధన పోరాటం నీకు ఏం తెలుసు అని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు,విలువలు బిజెపి పార్టీకి ఏం తెలుసు అన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచేల వ్యాఖ్యానించిన ఎంపీపై తెలంగాణ రాష్ట్ర బిజెపి ఎంపీలు ఖండించకపోవడం సిగ్గుచేటు అన్నారు.
ఎంతోమంది బలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్రాన్ని ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు.భారతదేశ స్వతంత్ర పోరాటంలో బిజెపి నాయకులు పాల్గొన్నారా..?వెంటనే తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రంపై ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక చిరుస్తామని హెచ్చరించారు.బిజెపి ప్రభుత్వానికి మహిళల పట్ల గౌరవం లేదని తేటతెల్లమైందని పేర్కొన్నారు.
డీలిమిటేషన్ పేరుతో బిజెపి ఇన్ని రోజులు నాటకం ఆడిందని ఆరోపించారు.మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించకుండా అడ్డుకుంటున్నది బిజెపి అని తేటతెల్లమయిందని పేర్కొన్నారు.అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బిజెపి ఎంపీ తేజస్వి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్లా మంగ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్,జిల్లా ఉపాధ్యక్షులు ఉబేద్ బిన్ యాహియ,భీంరావు,కార్యదర్శి శంకర్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా,మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్,నాయకులు జక్కయ్య, సుధాకర్, సత్యనారాయణ, సంతోష్, చిరంజీవి,వినోద్ ,సాయి ,రఫ్ తదితరులు పాల్గొన్నారు.






