18 April, 2026 | 11:18 AM

తెలంగాణ తల్లి రూపం మార్పుపై బీఆర్‌ఎస్‌కు పోరాడే హక్కు లేదు

17-12-2024 01:33 AM

కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ తల్లి విగ్రహాన్ని 2007లో ‘తల్లి తెలంగాణ పార్టీ’ మొదట ఆవిష్కరించిందని ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తెలిపారు. నాడు తల్లి తెలంగాణ పార్టీ కార్యాచరణలో బడుగు, బలహీన, సబ్బండ వర్గాల తల్లి ప్రతిరూపంగా బీఎస్ రాములు చిత్రీకరణతో తొలి విగ్రహం ఏర్పడ్డదన్నారు.

అప్పటికి నాటి టీఆర్‌ఎస్, నేటి బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ తల్లి వి గ్రహ రూపకల్పన చేయలేదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేశారే తప్ప వారు అధికారంలో ఉన్న పదేళ్లలో ఎన్నడూ అధికారి కంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింద ని తెలిపారు.

తెలంగాణ తల్లి రూపం మార్పు పై బీఆర్‌ఎస్ పార్టీకి కొట్లాడే హక్కు లేదని ఆమె ట్వీట్ చేశారు. తల్లి తెలంగాణ విగ్రహరూపాన్ని బీఆర్‌ఎస్ మార్చితే అప్పట్లో మన తెలంగాణ ఉద్యమకారులు ఎవరూ కొట్లాడలేదన్నారు. మన బోనాలు, బతుకమ్మ సం స్కృతి తరతరాలుగా నిలిచే ఉన్నాయన్నారు. వాటిని రాజకీయ పార్టీల ప్రయోజనాలకు ఉపయోగించవద్దని చెప్పారు.