27-12-2025 12:53:06 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిసెంబర్ 29 తేదీన నిర్వహించే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుంగతుర్తి మండల సర్పంచుల ఫోరమ్ మాజీ ఉపాధ్యక్షులు లాకవత్ యాకో నాయక్ పిలుపునిచ్చారు .2019 నుండి 2024 వరకు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ దీనితో మాకు అప్పులు అయ్యాయని తెలిపారు..తమ పెండింగ్ బిల్లులు వెంటనే ప్రభుత్వం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.