27-12-2025 12:44:57 PM
ఆడపిల్లలపై అలా మాట్లాడేందుకు ఏం హక్కుంది?
హైదరాబాద్: మహిళల దుస్తులపై నటుడు శివాజీ వ్యాఖ్యలను నాగబాబు(Nagababu slams actor Sivaji) తప్పుబట్టారు. సమాజం పురుషాధిక్య ఆలోచనల నుంచి బయటకురావాలని పిలుపునిచ్చారు. మహిళలు మోడ్రన్ దుస్తులు ధరించడం తప్పు కాదని నాగబాబు తెలిపారు. మహిళలపై అత్యాచారాలు వారి దుస్తుల వల్ల జరగట్లేదని వివరించారు. మగవాళ్లు క్రూరత్వంతోనే రేప్ లు జరుగుతున్నాయని వెల్లడించారు. ఫలానా దుస్తులే వేసుకోవాలని చెప్పేందుకు మీకేం హక్కు ఉందని ప్రశ్నించారు. సామాన్య వ్యక్తిగా ఈ అంశంపై స్పందిస్తున్నానని నాగబాబు చెప్పారు. ''నేను శివాజీని టార్గెట్ చేయడం లేదు, శివాజీని టార్గెట్ చేస్తున్నాననుకుంటే నేనేం చేయలేను. మగవాళ్లందరినీ తప్పుపట్టట్లేదు.. కొందరి గురించి చెబుతున్నా'' అని నాగబాబు పేర్కొన్నారు.
ప్రపంచంలో ఫ్యాషన్ రోజురోజుకి మారిపోతుంటుందని, ఒకప్పుడు తాను కూడా ఆలోచించేవాడిని, కానీ తన ఆలోచన మార్చుకున్నానని సూచించారు. ఆడపిల్లలను బతకనీయండి, మగవారితో సమానంగా బతికే హక్కు వారికి లేదా? అని ప్రశ్నించారు. ఆడవాళ్లు తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోండి, ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలని నాగబాబు కోరారు. మహిళల దుస్తులపై శివాజీ కామెంట్స్ వైరల్ కావడంతో ఇస్ స్టా వేదికగా నాగబాబు వీడియో విడుదల చేశారు. నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం నాడు మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు.