calender_icon.png 27 December, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలి

27-12-2025 12:50:58 PM

సర్పంచ్ కోరుకొప్పుల నరేష్ గౌడ్

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని బండరామారం, సూర్యతండ, మంచ్యతండాకు సూర్యాపేట డిపో నుండి నూతనంగా ప్రారంభమైన బస్సు సర్వీసును ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని బండరామారం సర్పంచ్ కోరుకొప్పుల నరేష్ గౌడ్ కోరారు. శనివారం గ్రామానికి చేరుకున్న బస్సుకు గ్రామస్తులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిపో అసిస్టెంట్ మేనేజర్ బానోతు సైదులు మాట్లాడుతూ. ఆయా గ్రామాల సర్పంచుల విజ్ఞప్తుల మేరకు బస్ సర్వీసును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వీసీ నాయక్, సర్పంచులు గుగులోతు బాజు, లాకావత్ రాందాస్, ప్రజలు పాల్గొన్నారు.