calender_icon.png 27 December, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరాలను కప్పేసిన ప్రచార ఫ్లెక్సీలు

27-12-2025 12:48:57 PM

పోలిటికల్ నేతల అత్యుత్సాహం.

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ నియోజకవర్గం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తమ ముఖ్య నేతల పర్యటనలు, పుట్టినరోజు సందర్భాల్లో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఊరూరా ప్రధాన రోడ్ల వెంట ఫ్లెక్సీలు పరిచి వాహనదారులు, ఇతరులకు ఆటంకం కలిగిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు రోడ్డు నిబంధనలను పాటించేలా పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా మూసివేస్తూ భారీ పొడవాటి ఫ్లెక్సీలను అడ్డుగా పెట్టుకున్నారు. తాము చేసే భూ కబ్జాలు, దౌర్జన్యాలు, ఇతర దందాలు మాసి పోతాయని కాబోలు ఆ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు వారిని ఆకాశానికి ఎత్తుతూ ప్రసంగాలు వల్లిస్తూ భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు.

తప్పులు కార్యకర్తలు చేసి బ్యానర్లు ఏర్పాటుతో నేతలకు రుద్దుతున్నారని వీటి ఫలితంగానే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయని  పోలీసులు పలు సందర్భాల్లో చెప్తున్నారు. ఒకవైపు నుంచి వెళుతున్న వాహనదారులకు అటువైపు నుంచి వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో నన్న ఆందోళన వాహనదారుల్లో వ్యక్తమవుతోంది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే మున్సిపాలిటీ నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంది కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే డివైడర్ కు ఆనుకొని ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా ట్రాఫిక్ పోలీసులు, మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల వాహనదారులు మండిపడుతున్నారు.