calender_icon.png 27 December, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారంలోకి వచ్చాక జైల్లో పెడతాం

27-12-2025 01:12:25 PM

హైదరాబాద్: అర్జెంటీనాకు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ(Lionel Messi) టూర్ కోసం సింగరేణి నిధులు ఎందుకు వాడారు? అని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, ఇతర బీఆర్ఎస్ నేతలు సింగరేణి డైరక్టర్ పా గౌతమ్ పొట్రును కలిశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... సింగరేణి నిధుల(Singareni funds) దుర్వినియోగంపై అధికారంలోకి వచ్చాక విచారణ చేయిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక విచారణ చేసి తప్పు చేసిన వారిని జైల్లో పెడతామని హెచ్చరించారు. సింగరేణి నిధులను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని హరీశ్ రావు ఆరోపించారు.

తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. లేకుంటే కార్మికుల పిల్లలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇల్లు ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టులను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులకు ధర్నా చేసే హక్కు లేదా.. ప్రశ్నించే హక్కు లేదా? అన్నారు. కేసీఆర్ హయాంలో 26 వేల అక్రిడేషన్ కార్డులు ఇచ్చామని వివరించారు. జర్నలిస్టుల కోసం రూ. 100 కోట్ల నిధి ఇచ్చామన్నారు. డెస్కుల్లో పని చేసేవారికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వబోమని రేవంత్ రెడ్డి అంటున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు.