calender_icon.png 27 December, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలగిరిలో కొమ్ము సురేష్ కుటుంబ సభ్యుల ధర్నా

27-12-2025 12:54:37 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం(Tirumalagiri Mandal) శుక్రవారం రాత్రి తొండ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన బైక్ ను ఢీకొన్న కారు  ప్రమాదంలో మరణించిన మామిడాల గ్రామ వాసి కోమ్ము సురేష్ (34) కుంటుంబ సభ్యులు న్యాయం కోసం జనగాం-సూర్యపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు స్థానికులు గుమికూడడడం, వాహనాలు నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.