27-12-2025 12:46:54 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా గ్రామ పంచాయతీ లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న నట్టల నివారణ పథకంలో భాగంగా గ్రామంలో నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు ప్రారంభించారు.గ్రామంలోని గొర్రెలు,మేకలు తదితర పశువులకు నట్టల మందులు వేసి మండల పశువుల డాక్టర్ శ్రావణి రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జెవిఓ విజయ,ఎల్ ఎస్ఎ రమాకాంత్,గోపాల మిత్ర సిబ్బంది రాంమోహన్,హనుమా అజయ్,రైతులు ధరవతు రాజా, చందులాల్,చంద్రు,చారి,సైదాగ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.