25 March, 2026 | 4:57 PM

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

25-03-2026 03:30 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోనీ రాంప్రతాప్ థియేటర్లో ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు, ఎల్లారెడ్డి ముద్దుబిడ్డ జాజాల సురేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య, సీనియర్ నాయకులు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం పటాసులు కాల్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ... మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యకర్తలు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

అలాగే రానున్న రోజుల్లో మరిన్ని పుట్టినరోజు వేడుకలు 100 సంవత్సరాలు జరుపుకోవాలని తెలిపారు.అలాగే రానన్న రోజుల్లో రాజకీయపరంగా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి, నాయకులు దుందుగల నరసింహులు, పేరుపల్లి సాయిబాబా,రాజీ రెడ్డి, వెంకట్ రెడ్డి, వంశీకృష్ణ గౌడ్, పడమటి దుర్గేష్,మంగలి యాదగిరి, మిద్దె బాబు రావు, జితేందర్ రెడ్డి, విజయ కుమార్, ఫరీద్, జయరాజ్, లక్ష్మీకాంతం, హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.