17 May, 2026 | 1:18 AM

ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ లైన్‌మెన్

17-05-2026 12:00 AM

ఆలేరు, మే 16 ( విజయక్రాంతి) : ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ స్తంభాల మంజూరు కోసం రైతు నుంచి లంచం తీసుకుంటున్న ఓ అసిస్టెంట్ లైన్ మెన్ ను ఏసీబీ అధికారులు శనివారం చాకచక్యంగా పట్టుకున్నారు. నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపిన వివరాల మేరకు యాదాద్రి భు వనగిరి జిల్లా మేడికుంటపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ఒక ట్రాన్స్‌పార్మర్, నాలుగు విద్యుత్తు స్తంభాలు కావాలని దరఖాస్తు చేసుకున్నాడు.

దీనికి గాను అసిస్టెంట్ లైన్ మె న్ రమేష్ రూ.35 వేలు లం చం అడిగినట్టు తెలిపారు. దీంతో రైతు ఏసీబీని ఆశ్రయించి వివరాలు తెలపడంతో దాడి చేసి రూ.35 వేలు రైతు ఇంటి వద్ద తీసుకుంటుండగా  పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలించినట్లు తెలిపారు.