17 May, 2026 | 1:18 AM

జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ

17-05-2026 12:00 AM
  1. ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు
  2. ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి) : జూన్ 8న రాత్రి 9 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుందని తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు. గతంలో 16 కౌంటర్లు ఉండగా, ఈసారి 35 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూ లైన్ సదుపాయం కల్పించామన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పర్యవేక్షణలో 1.40 లక్షల కోరమీను చేప పి ల్లలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు.