17 May, 2026 | 1:18 AM

ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

17-05-2026 12:00 AM

మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు రాజ్కుమార్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్య క్షులు గౌర బీరప్ప, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విక్రమ్ శర్మ, ప్రధాన కార్యదర్శి జి నర సింహారావు, టీఆర్‌ఎల్డీ కార్యకర్తలు భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి ఐకేపీ ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని శనివారం సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకు న్నారు.

దిలీప్‌కుమార్ మాట్లాడుతూ.. ధా న్యం కొనుగోలు నిర్వహణలో ప్రభుత్వం పూ ర్తిగా విఫలమైందన్నారు.   ఇప్పటికే కేరళలో మాన్సూన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రైతులకు సహాయం చేసి, యార్డులకు వచ్చే ధా న్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డి మాండ్ చేశారు. అనంతరం ఆలేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ఏ ర్పాటు చేసిన కమిటీకి కే కేశవరావును చైర్మన్‌గా నియమించడం హాస్యాస్పదమని అన్నారు.

కే కేశవరావు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నారని గు ర్తు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆయన కుమార్తెకు మేయర్ పదవి ఇవ్వడమే పెద్ద తప్పిదమైతే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించడం కూడా అంతే అభ్యంతరకరమని ఆయన పేర్కొన్నారు.

జూన్ 27న వరంగల్ కేఐటీఎస్ కళాశాలలో రాష్ట్రీయ లోక్ దళ్ ఆధ్వర్యంలో రోజ్గార్ స్కిల్ అండ్ లోన్ మేళా నిర్వహిస్తున్నామని, నిరుద్యోగ యువత ఈ అవ కాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర యువజన అధ్యక్షులు రాజు కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. అదే రోజు లక్ష్యం కోసం లక్ష సైన్యం పేరుతో రిటైర్డ్ ఆర్మీ అధికారుల ఆధ్వర్యంలో లక్ష మంది యువత నియామక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.