16-05-2025 12:30:57 AM
బోధన్, మే 15 (విజయ క్రాంతి): విధినిర్వహణలో ఉన్న అసిస్టెంట్ లైన్మెన్ విద్యుత్ ఘాతంతో మృతి చెందిన సంఘటన బోధన్ మండలంలోని రాజీవ్ నగర్ తండాలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఎడపల్లి గ్రామానికి చెందిన మహేందర్ బోధన్ మండలంలో అసిస్టెంట్ లైన్మెన్ గా పనిచేస్తున్నాడు గురువారం ఉదయం విధుల్లో భాగంగా రాజీవ్ నగర్ తండాలో విద్యుత్ స్తంభం ఎక్కాడు ఎల్సీ తీసుకోకుండా మహేందర్ పోలెక్కడంతో 11 కేవీ లైన్ విద్యుత్ తీగ తగిలి కింద పడి పోయాడు.
స్థానికులు హుటాహుటిన మహేందర్ ను బోధన్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. కుటుంబ బాధ్యతలు నిర్వహించే మహేందర్ విద్యుత్ ఘాతంతో మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. బాధిత కుటుంబాన్ని డిఇ ముక్తార్ పరామర్శించారు ఎల్ సి తీసుకోకుండా పోల్ ఎక్కడం వల్లనే మహేందర్ మృతి చెందాడని ఆయన తెలిపారు.