16-05-2025 12:30:52 AM
నాగర్ కర్నూల్, మే 15 ( విజయక్రాంతి) నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మాచారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం 12.6 కోట్లతో నూతనంగా ప్రారంభించనున్న ఇందిరా సౌర గిరి జలవికాస పథకం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 18న పర్యటించనున్నారు.
నేపథ్యంలో గురువారం రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఇతర ఆయా శాఖల జిల్లా అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లపై పరిశీలించారు.
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గిరిజనుల కోసం రూ. 12,600 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇందిర సౌరగిరి జల వికాస పథకం ద్వారా 6 లక్షల ఎకరాల గిరిజన భూములకు సాగునీటిని అందించి 2.10 లక్షల గిరిజన రైతుల కు లాభం చేకూర్చనున్నారు.
దేశంలోనే ఇది అత్యంత గొప్ప విషయమని ఆ స్థాయిలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనులను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు మంత్రి తెలిపారు. అం దుకు తగినట్లుగానే సభా వేదిక, పార్కింగ్, హెలిపాడ్, ట్రాఫిక్ సమస్యలు వంటి వాటి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.