13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

జవహర్ నగర్ లో ఇందిరమ్మ క్యాంటీన్ ఏర్పాటుకు సహకరించండి

30-03-2026 08:32 PM

జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు అశోక్ విజ్ఞప్తి

జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ లో ఇందిరమ్మ క్యాంటీన్ (ఐదు రూపాయల భోజనం) ఏర్పాటుకు సహకరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు చింతకింది అశోక్ విజ్ఞప్తి చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ బాలాజీ నగర్ ప్రాంతంలో అడ్డా భవన నిర్మాణ హమాలీ కార్మికుల కోసం ఐదు రూపాయల భోజన పథకాన్ని (ఇందిరమ్మ క్యాంటీన్) ఏర్పాటు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంతను సోమవారం కలసి వినతి పత్రం సమర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ... అడ్డా కార్మికులకు రోజువారి కూలి దొరకడం గగనమైన పరిస్థితుల్లో కూలీలందరూ అర్థాకలితో అలమటిస్తూ, పస్తులు ఉంటున్నారని తెలిపారు. వారి జీవితం నిత్యం ఒక పూట భోజనమేనని, వారి క్షుబాధను తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వానిదని  తెలిపారు. జవహర్ నగర్ ప్రాంతంలో సుమారు 300కు పైగా కార్మికులు ఉపాధి కోసం ప్రతిరోజు అడ్డాల వద్ద పడి కాపులు పడుతున్నారని వీరిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం త్వరగా ఇందిరమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కోరారు. గరీబోళ్లకు అడ్డాగా జవహర్ నగర్ గడ్డ నిలుస్తుందని తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన కమిషనర్ త్వరలో ఇందిరమ్మ క్యాంటీన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కీసర మండల కార్యదర్శి నర్సింగ్ రావు, నాయకులు నగేష్, శివన్నారాయణ, కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.