13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

మామిడి తోట వేలంపాట

30-03-2026 08:28 PM

1,01,000/-వేలం పాటను దర్శించుకున్న మచ్చేందర్ గౌడ్

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామ పరిధిలో గల ఉద్యాన క్షేత్రంలో మామిడి తోట వేలంపాట నిర్వహించడం జరిగిందని ఇన్చార్జి ఎచ్ఓ. సంతోష్ రాణి తెలిపారు.ఈ సందర్భంగా ఉద్యాన క్షేత్రం ఇన్చార్జి హెచ్ఓ.సంతోష్ రాణి మాట్లాడుతూ... మాల్తుమ్మెద గ్రామ పరిధిలోగల ప్రభుత్వ ఉద్యాన క్షేత్రంలో గల 20 ఎకరాల మామిడి తోట పంటను సోమవారం వేలంపాట నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ వేలంపాటలో  ధరావస్తు 1000 రూపాయలు చెల్లించి 25 మంది సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. అయితే 25 మంది సభ్యుల నుండి గోపాల్పేట్ గ్రామానికి చెందిన మచ్చేందర్ గౌడ్ 1,01,000/-వేలంపాటను దక్కించుకున్నట్లు ఉద్యాన క్షేత్రం ఇన్చార్జ్ హెచ్ఓ సంతోష్ రాణి పేర్కొన్నారు.

వేలం పాట నిర్ధారించిన తర్వాత కొంత సొమ్మును రెండు రోజులో చెల్లించాలని మిగతా సొమ్ము వారం రోజులో మొత్తం సొమ్ము చెల్లించిన తర్వాత తోటలోనికి అనుమతించడం జరుగుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ఎలాంటి నష్టం జరిగిన ప్రభుత్వ ఉద్యమ క్షేత్రంకు ఎటువంటి సంబంధం ఉండదని మామిడి తోట కాపు చేసేందుకు నీటిని మాత్రమే ఉద్యాన క్షేత్రము అందిస్తుందని పేర్కొన్నారు.వేలంపాట నిర్ధారించిన పిమ్మట ఏదైనా కారణాలవల్ల జరిగిన వేలం పాటను ఉన్నత అధికారులు రద్దుచేసే పూర్తి అధికారం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ అధికారులు పాల్గొన్నారు.