ద్వాదశ రాశిఫలాలు
18.-8.-2024 నుండి 24.-8-.2024 వరకు
రామడుగు రంగన్న సిద్ధాంతి
మేషం
ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి మంచిగా ఉంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులు కొంటారు. శుభకార్యాలు చేస్తారు. సంతోషంగా గడుపుతారు. యువతీ యువకులకు మంచి ఉద్యోగాలు దొరకుతాయి. అనుకూల వివాహ సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగస్తులకు ధన లాభం, ప్రమోషన్లు కలుగుతాయి. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు చదువులలో ముందుంటారు. రైతులు ఆనందంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది.
వృషభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. ధనవ్యయమవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగం, పెండ్లి ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు విదేశీయానం ఫలిస్తుంది. రైతులకు స్వల్ప లాభాలు కలుగుతాయి. - ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.- మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
మిథునం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఇంట్లో బంధువులతో సందడిగా ఉంటుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో ముందుంటారు. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు ధనలాభం పొందుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది.
కర్కాటకం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. శుభకార్యక్రమాలు చేస్తారు. మానసిక అశాంతి ఏర్పడుతుంది. కొందరితో విభేదాలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహాలలో స్తబ్దత ఉంటుంది. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులు సంతోషవార్తలు వింటారు. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో లాభం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది.
సింహం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ధన వ్యయం అవుతుంది. చేసే పనులలో సమస్యలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులకు చదువులలో స్తబ్దత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 35 శాతం అనుకూలత, 65 శాతం ప్రతికూలత ఉంది.
కన్య
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. చేసే పనులు పూర్తవుతాయి-. కొత్తవారితో పరిచయాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగం, కోరుకున్న వారితో వివాహ నిశ్చయాలు జరుగుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. శుభం జరుగుతుంది. వ్యాపారస్తులకు, రైతుల సంతోషం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది.
తుల
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. మానసిక అశాంతి ఏర్పడుతుంది. బంధువులతో స్పర్ధలు కలుగుతాయి. చేసే పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు పని భారం, ఒత్తిడి పెరుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు అనుకూల కాలం కాదు. మొత్తం మీద ఈ రాశివారికి 25 శాతం అనుకూలత, 75 శాతం ప్రతికూలత ఉంది.
వృశ్చికం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. శుభవార్తలు వింటారు. పనులలో ఆటం కాలు కలుగుతాయి. బంధువులతో స్పర్ధలు ఏర్పడతాయి. ధన వ్యయమవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉం టుంది. విద్యార్థులు శ్రమించవలసి ఉం టుంది. ఉద్యోగస్తులకు పని భారం, ఒత్తిడి పెరుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు అనుకూల కాలం కాదు. మొ త్తం మీద ఈ రాశివారికి 25 శాతం అనుకూలత, 75 శాతం ప్రతికూలత ఉంది.
ధనుస్సు
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మంచివారితో స్నేహం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ధనవ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులలో శ్రద్ధ చూపుతారు. వ్యాపారస్తులు, రైతులు చేసే పనులలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పని భారం ఉన్నా ధనలాభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 70 శాతం అనుకూలత, 30 శాతం ప్రతికూలత ఉంది.
మకరం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ధన వ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉన్నది.- విద్యార్థులు పట్టుదలతో చదవాలి. వ్యాపారస్తులు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
కుంభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనసు అశాంతిగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు పట్టుదలతో చదవాలి. వ్యాపారస్తులు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.
మీనం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యస్థంగా ఉంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. బంధువులలో సఖ్యత లోపిస్తుంది. ధన వ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులకు చదువులలో అనాసక్తి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు స్వల్ప లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.






