ఐదురోజులు వర్షాలు
నేడు పలు జిల్లాల్లో భారీ వానలు
వారంపాటు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): రానున్న ఐదురోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో భారీ వానలు పడుతాయని అంచనా వేసింది. ఈ మేరకు వర్ష సూచన ఉన్న జిల్లాలకు వారం రోజులపాటు అలర్ట్ జారీ చేసింది. ఆదివారం నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములు గు, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెద క్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది.
ఇదే సమ యంలో మిగతా జిల్లాల్లో ఓ మోస్త రు వానలు పడుతాయని అంచనా వేసింది. మిగతా నాలుగు రోజుల్లో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ము లుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖ మ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో 40 కిలోమిటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు.






