ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం
అరుణోదయ కాలనీలోని హత్య కేసును ఛేదించిన పోలీసులు
ఎల్బీనగర్, డిసెంబర్ 7: హయత్‌నగర్ డివిజన్ అరుణోదయ కాలనీలో తాజాగా జరిగిన హత్యా కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. సీఐ నాగరాజు తెలిపిన వివరాలు.. ప్రకాశం జిల్లాకు చెందిన ఎక్కలి కాశీరావు (40), భార్య సుమతో పాటు కుమారుడు, కూతురితో కలిసి అరుణో దయ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు.
కాశీరావు పాత కార్లను కొనుగోలు చేసి, విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. కాశీరావు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని పై అంతస్తులో నల్గొండ జిల్లాకు చెందిన పెద్దకాని శేఖర్(24) అనే యువకుడు ఉంటున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. శేఖర్ స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో శేఖర్ తన అవసరాల నిమిత్తం కాశీరావు దగ్గర 4 లక్షలు అప్పు తీసుకున్నాడు. వాటిని తిరిగివ్వాలని కాశీరావు ఒత్తిడి తీసుకొచ్చా డు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఇద్దర మధ్య మాటామాటా పెరిగింది. కోపంలో శేఖర్ కాశీరావు గొంతు కోసి, హత్య చేశాడు.
మృతుడి భార్య సుమలత ఫిర్యాదుతో చేపట్టిన పోలీసులు శేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఉదాంతంలో అయితరాజు శంకర్(22), పెద్దగాని సాయి(22), భావనాసాయి ప్రసన్నకుమార్(30)లకూ హస్తమున్నట్లు తేలింది. వీరికి కూడా కాశీరావు అప్పులు ఇచ్చేవాడని తెలిసింది. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.




