మియాపూర్ శ్రీ ఆధ్య కాలేజ్‌లో దారుణం
ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధిని చితకబాదిన కాలేజీ డైరెక్టర్..
మియాపూర్ పోలీసులకు పిర్యాదు చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు..
శేరిలింగంపల్లి: మియాపూర్ ఆధ్య కాలేజ్(Sri Aadya Junior College)లో దారుణం చోటుచేసుకున్నది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి కనీష్క(17)ను కాలేజీ డైరెక్టర్ బాలకృష్ణ(College Director Balakrishna) ఇష్టం వచ్చినట్లు చితకబాదాడు. దీంతో ఎందుకు విచక్షణారహితంగా కొట్టారు అని ప్రశ్నించడానికి వెళ్లిన తన తల్లి రేఖ, అక్కపై కూడా కాలేజీ డైరెక్టర్ బాలకృష్ణ దాడికి ప్రయత్నించడం గమనార్హం. దీంతో పాటు ప్రిన్సిపల్ మానస తీవ్ర పదజాలంతో దుర్భషాలాడుతూ తిట్టినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకొని ఆధ్య కాలేజీకి చేరుకున్న ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులపై కూడా కాలేజీ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. కాలేజ్ ప్రిన్సిపాల్ మానస ఉన్నత స్థాయి పోలీసు అధికారుల పేరుతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలుస్తోంది. విద్యార్ధిని తల్లిదండ్రులు మియాపూర్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






