calender_icon.png 20 June, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారికి మరమ్మతులు

19-06-2025 11:08:58 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూరు మండలంలోని సలుగుపల్లి గామం నుంచి పెంచికలపేట మండలం వరకు రోడ్డు మార్గం చాలా అధ్వానంగా తయారైంది. వర్షాకాలం కావడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అయితే గత 6 నెలల క్రితం కూడా సలుగుపల్లి నుంచి పెంచికలపెట్ వరకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Former MLA Koneru Konappa) సూచన మేరకు ఆయన అభిమానులు, కార్యకర్తలు శ్రమదానంతో రోడ్డు మరమత్తులు చేశారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సూచన మేరకు కోనేరు అభిమానుల శ్రమదానంతో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ... పజల సమస్యలను తెలుసుకొని పని చేసే ఏకైక ప్రజా నాయకుడు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అని పేర్కొన్నారు. రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చివేసినందుకు మాజీ ఎమ్మెల్యేకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోనేరు అభిమానులు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.