8 August, 2026 | 2:48 AM

పారిశుద్ధ్య కార్మికుడిపై దాడి

08-08-2026 01:45 AM

ఉస్మానియాకు తరలింపు

కొందుర్గు, అగస్టు 7(విజయక్రాంతి): షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలోని ఉమ్మెంత్యాల గ్రామంలో చెత్త సేకరణ వాహనానికి అడ్డంగా ఉన్న వాహనాన్ని పక్కకు తీయమని కోరినందుకు  పారిశుద్ధ్య కార్మికుడిపై  దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ కార్మికుడిని ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.