మాచిడి సత్యనారాయణ మృతి పట్ల మంత్రి శ్రీధర్ బాబు సంతాపం
హైదరాబాద్‌లో నిమ్స్‌కు చేరుకుని పార్థివ దేహానికి నివాళులు
మంథని, ఆగస్టు 7(విజయక్రాంతి) మంథని పట్టణానికి చెందిన మాచిడి రాము గౌడ్ అన్నయ్య మాచిడి సత్యనారాయణ అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఈ విషాద వార్త తెలుసుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెంటనే నిమ్స్ ఆసుపత్రికి చేరుకుని మాచిడి సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు.
మృతుని కుటుంబ సభ్యులను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.మంథని ప్రాంతానికి చెందిన కుటుంబంలో విషాదం చోటుచేసుకున్న విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్లో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు నిమ్స్కు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించడం పట్ల పలువురు అభినందించారు. మాచిడి సత్యనారాయణ మృతి పట్ల మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.






