8 August, 2026 | 3:25 AM

నిరాధార ఆరోపణలు మానాలి

08-08-2026 01:46 AM

కౌన్సిలర్ మహేష్

మొయినాబాద్, ఆగస్టు 7(విజయక్రాంతి): తనపై డబ్బులు తీసుకున్నారంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని మొయినాబాద్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ మహేష్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామంలో జరిగిన పనుల గురించి ప్రజలకు పూర్తి అవగాహన ఉందని, వాస్తవాలను పక్కనబెట్టి రాజకీయ విమర్శలు చేయడం బాధ్యతాయుతమైన నాయకుల లక్షణం కాదని పేర్కొన్నారు.

తాను డబ్బులు తీసుకున్నానని ఆరోపిస్తున్న వారు అందుకు సంబంధించిన ఆధారాలను బహిరంగంగా చూపించాలని సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంపైనే తన దృష్టి ఉంటుందని, వ్యక్తిగత విమర్శల కంటే అభివృద్ధి అంశాలపై చర్చించడం మంచిదని పేర్కొన్నారు.