16 April, 2026 | 9:20 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఆర్మీ ఉద్యోగిపై దాడి

07-06-2025 01:56 AM

కొండపాక, జూన్ 6:  బెదిరించి దాడి చేసిన  వ్యక్తిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపినట్లు త్రీటౌన్ సిఐ విద్యాసాగర్ తెలిపారు. త్రీ టౌన్ విద్యాసాగర్ తెలిపిన వివరాల మేరకు నేతి శ్రీకాంత్  మర్పడగ గ్రామం కొండపాక మండలంలో మే, నెల  27. నాడు  అతని స్నేహితుడు బొడపట్ల బాబు లు కలిసి మార్పడగ గ్రామంలో భాను కిరాణం షాపు వద్ద థమ్సప్ త్రాగుతుండగా అక్కడికి పిండి శ్రీశైలం వచ్చి వారిని అడ్డుకుని అక్కడ ఆర్మీ జవాన్ శ్రీకాంత్ పై అసభ్య పదజాలంతో తిడుతూ, ఆర్మీ ఉద్యోగాన్ని కించపరస్తూ అతని గళ్ళ పట్టుకుని బౌతికంగా దాడి చేసి కొట్టినాడు.   

ఇట్టి విషయంలో కేసు నమోదు చేయగా నిందితుడు అప్పటినుండి తప్పించుకుని తిరుగుతున్నాడు. శ్రీశైలం పై   గతంలో  పలువురి పై భౌతిక దాడి చేసిన బెదిరించిన కేసులు సిద్దిపేట వన్ టౌన్  సిద్దిపేట త్రీ టౌన్ లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. గతంలో  పోలీసు ల విదులను ఆటంకం కలిగించిన కేసులు ఉన్నాయి.   

సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ నిందితున్ని అరెస్టు చేసి,  మెజిస్ట్రేట్  ముందు హాజరు పర్చగా,  సిద్దిపేట జిల్లా జైలు కు రిమాండుపై పంపారు.  గ్రామాలలో పట్టణాలలో  ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని  ఇష్టం ఉన్నట్లు ప్రవర్తిస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేసి  చర్యలు తీసుకుంటామని త్రీటౌన్ సీఐ  విద్యాసాగర్ హెచ్చరించారు.