30-06-2025 01:50:53 AM
కాగజ్‌నగర్, జూన్ ౨౯: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం చింతగూడ, కోయ వాగు గ్రామాల మహిళలు ఆదివా రం తమ గ్రామాల పరిధిలోని బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. ఆ షాపు ల్లోని మద్యం సీసాలను ధ్వంసం చేశారు. రెండురోజుల క్రితం ఈ గ్రామాలకు చెంది న మహిళలు కాగజ్‌నగర్ ఎక్సైజ్ కార్యాల యం ఎదుట ధర్నా చేపట్టి సీఐ రవికి వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ బెల్ట్ షాపులను తొలగించకపోవడంతో మహిళలందరూ ఏకమై వాటిని తొలగించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు బెల్ట్ షాపులను ఎత్తివేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆ గ్రామంలోని బెల్టు షాపుల్లో లైసెన్సు మద్యంతో పాటు, దేశి దారు, నాటు సారా విక్రయాలు జరుపుతున్నట్లు తెలిసిందని సత్వరమే బెల్ట్ షాపులను శాశ్వతంగా మూసివేయాలంటూ మహిళలు డిమాండ్ చేశారు.