పెద్దపల్లి, (విజయక్రాంతి): తన కూతురు మృతికి వైద్యుని నిర్లక్ష్యమే కారణమంటూ పెద్దపెల్లి పట్టణంలోని పిల్లల దవాఖానపై దాడి గురువారం దాడి చేశారు. శ్రీ సిద్ధార్థ హాస్పిటల్ లో ఖదీర్ అనే వ్యక్తి సంబంధించిన ఏడు నెలల కూతురు దవాఖానలు చేర్పించగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని, దవాఖానను ధ్వంసం చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా కట్టు దిట్టమైన బందోబస్తూ ఏర్పాటు చేశారు. హాస్పటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. వైద్యుడు పరార్ లో ఉన్నాడని, స్థానిక సాయంతో పోలీసులు పరిస్థితి చక్కదిద్దుతున్నారు.