6 July, 2026 | 2:04 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి కుటుంబంపై దాడి

25-03-2025 11:12 PM

ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి కుటుంబంపై అమ్మాయి తరపువారు దాడి చేసిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన అచ్చన మహేష్, అదే గ్రామానికి చెందిన చేగురి కావ్యశ్రీ ఇద్దరు రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమ వివాహం ఇష్టంలేని అమ్మాయి తరపువారు మంగళవారం ఉదయం అచ్చన మహేష్ ఇంట్లోకి ప్రవేశించి తన అక్క మౌనికపై దాడి చేశారు. మౌనిక ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.