12-09-2024 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): సికింద్రా బాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఓ జూనియర్ డాక్టర్‌పై బుధవారం దాడి జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యురాలి ఆఫ్రాన్‌ను లాగి ప్రకాశ్ అనే వ్యక్తి దాడి చేశాడు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఈ దృశ్యాలన్నీ ఆసుపత్రిలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, దాడికి పాల్పడిన వ్యక్తికి మూర్ఛ వ్యాధి ఉన్నట్లు, మానసిక స్థితి సరిగా లేనట్లు తెలుస్తోంది.
చర్యలు తీసుకోవాలి : జూడాలు
విధుల్లో ఉన్న మహిళా జూనియర్ డాక్టర్‌పై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.