13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఎమ్మెల్యే కౌశిక్ ఇంటిపై దాడి

31-03-2026 12:00 AM
  1. టమాటాలు, కోడిగుడ్లు విసిరిన యూత్ కాంగ్రెస్ నేతలు
  2. కౌశిక్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
  3. ఎమ్మెల్యే కడియంపై వ్యాఖ్యలను వెనక్కి తీసకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్

హుజురాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో  ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని మున్సిపల్ సమీపంలో కౌశిక్‌రెడ్డి ఇంటిని యూత్ కాంగ్రెస్ నాయకులు సోమవారం ముట్టడించారు. ఇంటిపైకి కోడిగుడ్లు, టమోటాలను విసిరుతూ ఎమ్మెల్యే దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఐ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశంలో దళిత ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్యేను హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరగనివ్వబోమని, ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వం రద్దు చేసే వరకు పోరాడుతామని హెచ్చరించారు.

ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వార్తల్లో నిలవాలని ముఖ్యమంత్రి, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పంజాల అరవింద్, శనిగరపు తరుణ్, విష్ణువర్ధన్, రాజు, ఎండి సాదిక్, జన్ను ప్రసాద్, బన్నీతో పాటు తదితరులు పాల్గొన్నారు.