13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్

31-03-2026 12:00 AM

పోలీస్‌స్టేషన్‌కు తరలింపు

బాన్సువాడ, మార్చి 30 (విజయక్రాంతి): మలిదశ తెలంగాణ ఉద్యమ కారుల ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ కు చెందిన మలి దశ ఉద్యమ కారులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉడత గంగాధర్ ప్రధాన కార్యదర్శి గంజి వారి చందు మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మెని ఫెస్టేలో ఉద్యమ కారులకు 250 గజాల స్థలం ఇంటి నిర్మానానికి ఆర్ధిక సాయం 25000 పెన్షన్ ఉద్యమ కారుల గుర్తింపు కార్డు

ఇచ్చి ఉద్యమ కారుల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆరు గ్యారంటీ కార్డులలో పొందు పరచడం జరిగింది కానీ నేటికీ ఇందిరమ్మ రాజ్యం వచ్చి 27 నెలలు అయినా ఉద్యమ కారులపై ఇలాంటి హామీ ఇవ్వలేదు ఇప్పటికయినా ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేర్చాలని ప్రభుత్వానికి తెలియ చేయడం కోసం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సమయంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విరమించడం జరిగింది

దీన్ని గమనించిన పోలీసులు పట్టణ ఉద్యమకారులను ముందస్తుగా అరెస్ట్ చేసి సొంత పూచి మీద వదిలి వేయడం జరిగింది. ఈ అరెస్టులో ఉడుత గంగాధర్ గుప్తా గంజివార్ చందు కాల్వ శ్యామ్ ఎదుబల్లి కృష్ణ భాస్కర్ గౌడ్ అగ్లావే దత్తు పల్లికొండ సాయికుమార్ గంగారామ్ ఉద్యమ కారులు పాల్గొన్నారు.