2 April, 2026 | 5:54 PM

ఖానాపూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు

02-04-2026 04:04 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా పద్మావతి నగర్, హనుమాన్ ఆలయంలో అర్చకులు సందీప్ శర్మ ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షులు అడ్డగట్ట రాజన్న, కౌన్సిలర్ నిమ్మల రమేష్ ,లింగాల లక్ష్మణ్, మురళి లా ఆధ్వర్యంలో పూజలు నిర్వహించగా, శ్రీరామ్ నగర్ మంచిర్యాల చౌరస్తా ,పంచముఖ హనుమాన్ ,జంగల్ హనుమాన్ ఆలయాల్లో భక్తులు జయంతిని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో జంగల్ హనుమాన్ కమిటీ అధ్యక్షులు కొక్కుల ప్రదీప్, గుగ్గిల రాజేందర్ ,విలాస్ తదితరులు భక్తుల సౌకర్యాలు ఏర్పాటు చేశారు.