29 July, 2026 | 3:51 AM

సూర్యాపేటలో మెడికల్ కౌన్సిల్ అధికారుల దాడులు

30-05-2024 12:17 AM

సూర్యాపేట, మే 29 (విజయక్రాంతి): మెడికల్ మాఫియాకు అడ్డాగా మారుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో మెడికల్ కౌన్సిల్ అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు క్లినిక్‌లలో తనిఖీ చేసిన అధికారులు.. నిబంధనకు విరుద్ధంగా అనుతులు లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్‌లను సీజ్ చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ శేషు మాట్లాడుతూ.. ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి క్లినిక్‌లుగా మార్చి అమాయక ప్రజలను మోసం చేస్తూ మోతాదుకు మించి యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్స్, ఇస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. నింబంధనలకు విరుద్ధంగా మెడికల్ క్లినిక్‌లు నిర్వహిస్తున్న వారిపై 34,35 ఎన్‌ఎంసీ యాక్ట్ ప్రకారం కేసులు, జరిమానా, జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు.