calender_icon.png 18 September, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడుంబా స్థావరాలపై దాడులు

18-09-2025 08:18:05 PM

ఆరుగురిపై కేసు నమోదు.

నర్సంపేట (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ అంజన్న రావు ఆదేశాల మేరకు నాటు సారా నియంత్రణకై స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గురువారం నల్లబెల్లి మండలం నందిగామ, రేలకుంట గ్రామాలలో నాటుసార  (గుడుంబా) స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి 45 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని 1900 లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. గుడుంబా నిర్మూలన ప్రధమ కర్తవ్యం అని అధికారులు వెల్లడించారు. ఈ దాడులలో వరంగల్ రూరల్ అసిస్టెంట్ ఎక్సైజ్  సూపరిండెంట్ మురళీధర్, వరంగల్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్  సూపరిండెంట్  శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి, వరంగల్ రూరల్ టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్ చందర్, ఎన్ఫోర్స్మెంట్ సిఐ నాగయ్య, ఎస్సైలు రమ, శిరీష, స్థానిక పోలీస్ ఎస్ఐ గోవర్ధన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.