వట్ట్టె జానయ్యయాదవ్ వజ్ర మిల్లుపై దాడులు రాజకీయ కుట్ర
రూ.69 కోట్ల స్కామ్ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు
సూర్యాపేట, జూలై 26 (విజయక్రాంతి) : తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యా దవ్ను రాజకీయంగా దెబ్బతీయడానికే కాం గ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విజిలెన్స్ దాడు లు చేయిస్తోందని టిఆర్పి జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో టిఆర్పి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వ హించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక అడిషనల్ కలెక్టర్కు సైతం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే విజిలెన్స్ అధికారులు ఈ దాడులు నిర్వహించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
గత మూడు రోజులుగా పత్రికల్లో, సోషల్ మీడియాలో జానయ్యయాదవ్‌పై వస్తున్న రూ.69 కోట్ల ధాన్యం స్కామ్ ఆరోపణలు ముమ్మాటికీ అవాస్తవమన్నారు. రూ. 69 కోట్లు స్కాం అయిందని చెప్తున్న ప్రభుత్వం.. ఆ ధాన్యాన్ని కళ్లారా చూపించేంతవరకు కూడా ఆగలేకపోతోందన్నారు. వజ్ర రైస్ మిల్లులో అన్యాయం జరిగిందని, వడ్లు, బియ్యం అమ్ముకున్నారంటూ పెట్టిన కేసులు, చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నా రు. చట్టాన్ని గౌరవించడమే కాకుండా, కార్యకర్తలకు సైతం చట్ట పరిధిలోనే పనిచేయాలని సూచించే వ్యక్తి వట్టె జానయ్య యాదవ్ అని, ఆయన తప్పించుకుని తిరుగుతున్నారనడం కేవలం దుష్ప్రచారమేనని కొట్టిపారేశారు.
బీసీల ఐక్యతను చూసి ఓర్వలేకే..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మధ్య ఉంటూ, ప్రత్యేకించి బీసీ సామాజిక వర్గాలను ఏకం చేయడంలో జానయ్య యాదవ్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని.. ప్రజలను చైతన్యపరుస్తున్నారనే భయంతోనే అధికార పార్టీ ఈ దాడులకు తెగబడిందని ఆరోపించారు.
అన్ని రాజకీయ పార్టీలు అంతర్గతంగా కుట్ర పన్ని, అధికార పార్టీతో చేతులు కలిపి ఈ దాడులు చేయిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా క్షేత్రంలో ఉన్న ఒక కీలక నేతపై జరుగుతున్న ఈ రాజకీయ కక్షసాధింపు చర్యలను ప్రజలందరూ గమనిస్తున్నారని, త్వరలోనే వీటికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కోనే మంజుల గౌడ్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.






