21 April, 2026 | 2:13 PM

వృద్ధురాలు గురవమ్మపై దాడి యత్నం

21-04-2026 12:47 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండలం పాత గుడిబండ గ్రామానికి చెందిన వృద్ధురాలు గురవమ్మపై సోమవారం అర్ధరాత్రి దాడి యత్నం చోటుచేసుకుంది. కుటుంబ ఆస్తి, వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో కూతురు, మనవళ్లు కలిసి ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన గురవమ్మను స్థానికులు వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలు తీవ్రరూపం దాల్చడం ఆందోళనకరమని గ్రామస్తులు పేర్కొంటున్నారు.