10 May, 2026 | 1:15 AM

ఎప్‌సెట్‌కు 93.44 శాతం మంది హాజరు

10-05-2026 12:00 AM

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉదయం సెషన్‌లో 34,823 మందికిగానూ 32,540 (93.44 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో 34,808 మందికి గానూ 32,390 (93.05 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. ఎప్‌సెట్ ప్రశ్నపత్రం కాస్త కఠినంగా, మధ్యస్థంగానూ వచ్చినట్లు తెలిసింది. ఈ నెల 11 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.