ప్రధాని మోదీ సభకు ప్రత్యేక రైలు
- విజయవాడ నుంచి ఉదయం 8 గంటలకు ట్రైన్
- హాజరయ్యేవారికి భోజన వసతి
- వివరాలు వెల్లడించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు
మహబూబాబాద్, మే 9 (విజయక్రాంతి): సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రి న రేంద్ర మోడీ పాల్గొననున్న బహిరంగ సభ కు హాజరయ్యేందుకు విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు ఆదివారం భారతీయ జన తా పార్టీ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసిం ది.07505 నంబర్‌తో ప్రయాణించే ప్రత్యేక రైలు విజయవాడలో ఉదయం 8 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు మధ్యాహ్నం 3:10 గంటలకు చేరుతుంది.
మార్గమధ్యలో ఈ రైలు ఎర్రుపాలెం, మధి ర, బోనకాలు, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, కేసముద్రం, వరంగల్, కాజీపేట స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుందని బీజేపీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.అలాగే సభ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణం లో కూడా 07506 ప్రత్యేక రైలు మల్కాజిగిరి నుండి రాత్రి 22:15 కు బయలుదేరి విజయవాడకు సోమవారం ఉదయం ఏడు గంటలకు చేరుతుందని చెప్పారు. 22 జనరల్ సిట్టింగ్ భోగిలతోపాటు రెండు ఎస్ ఎల్ ఆర్ భోగీ లు ఉంటాయని, సభకు హాజరయ్యే వారికి రైలులో తాగునీరు, భోజన వసతి ఉంటుందని ఆయన తెలిపారు.






