10 May, 2026 | 1:15 AM

దేవునితండాలో గాలివాన బీభత్సం

10-05-2026 12:00 AM

చందుర్తి, మే 9,(విజయక్రాంతి): చందుర్తి మండలం దేవునితండాలో గాలివాన భీభత్సం సృష్టించింది. దీంతో గ్రామంలో పలుచోట్లా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. గ్రామానికి చెందిన నునావత్ రాజుకు చెందిన పశువుల పాక పై కరెంటు స్తంభం పడటంతో సుమారు 50వేల రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపారు.ఈ సంఘటలో అదృష్టవషాత్తు ఎలాంటి ప్రాణం నష్టం వాటిల్లలేదు.బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.