ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి
28-07-2026 12:00 AM
ఆర్డీఓ సూర్యనారాయణ
కోదాడ, జూలై 27: ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని ఆర్డీఓ సూర్యనారాయణ అన్నారు. సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అల్వాలపురం గ్రామంలో రైతు వేదిక ఆవరణలో విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాల మేరకు సాగు చేయాలని రైతులను కోరారు.
ఎంపీడీఓ హు స్సేన్ మాట్లాడుతూ పశుగ్రాసం విత్తనాలు, కూరగాయల పందిళ్ళు రాయితీపై ఇవ్వడం జరుగుతుందని, కరువు దృష్టిలో ఇంకుడు గుంతలు తీసుకోవాలని రైతులను కోరారు. ఈ కార్యక్ర మంలో మండల వ్యవసాయ అధికారి పాలెం రజని, మండల రెవెన్యూ అధికారి సంతోష్ కిరణ్, ఎంపిఓ రాంబాబు, వ్యవసాయ విస్తరణ అధికారులు పిచ్చయ్య, ఝాన్సీ, మహేష్, నగేశ్, గ్రా మాల రైతులు, డీలర్స్ పాల్గొన్నారు.






