28 July, 2026 | 12:55 AM

ప్రభుత్వ భూమిని కాపాడాలి

28-07-2026 12:00 AM
  1. అల్లాపూర్‌లో గత ప్రభుత్వం స్కూళ్లకు కేటాయించిన భూమి కబ్జాకు యత్నం
  2. కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆగ్రహం

కూకట్‌పల్లి, జూలై 27 (విజయక్రాంతి ): కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్‌లో తెలుగు ఉర్దూ మీడియం స్కూల్‌ల కోసం గత ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ భూమిని కొందరు కాంగ్రెస్ నాయకులు కబ్జాలు చేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లాపూర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్లైన్ పనులనుసోమవారం ప్రారంభించారు. అనంతరం అల్లాపూర్ డివిజన్లో కబ్జాకు గురైన సర్వే నంబర్ 18 ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సర్వే నంబర్ 18 లోని నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రహరీ గోడ నిర్మించడానికి రూ.50 లక్షల రూపాయలు కేటాయించిందన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ నిధులు ఏమయ్యాయో తెలియదు కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కలెక్టర్ సహకారంతో ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టామన్నారు.

వీలైనంత త్వరగాఅధికారులు పాఠశాలల  నిర్మాణానికి నిధులు కేటాయించి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా పాఠశాలల నిర్మించాలన్నారు. రెవెన్యూ అధికారులకు, హైడ్రాధికారులకు ఈ ప్రభుత్వ భూమి కాంగ్రెస్ నాయకులు కబ్జాలు చేస్తున్నారనిఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా బి ఆర్ ఎస్  మైనార్టీ అధ్యక్షులు గౌసుద్దీన్,  నాయకులు లింగాల ఐలయ్య, పిల్లి తిరుపతి, వీరారెడ్డి,బాబా,జ్ఞానేశ్వర్,జగన్, శ్రీనివాసరెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, మల్లికార్జున  తదితరులు పాల్గొన్నారు.